సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

‘‘వెంట మీరు ఉన్నారు, చెంత మీ నమ్మకం ఉంది... దేశం ముందుకు సాగుతుంది...’’ చిత్ర ప్రదర్శన ప్రారంభం

Posted On: 20 DEC 2017 8:40PM by PIB Hyderabad
Press Release photo

భారత ప్రభుత్వంసమాచార ప్రసార మంత్రిత్వ శాఖదృశ్య ప్రకటన విభాగం,  హైదరాబాద్ ఆఫీస్ 5 రోజుల "వెంట మీరు ఉన్నారుచెంత మీ నమ్మకం ఉంది...దేశం ముందుకు సాగుతుంది" చిత్ర ప్రదర్శనను మండల పంచాయత్ డెవలప్ట్ మెంట్  ఆఫీస్ హాల్జడ్చెర్ల టౌన్మహబూబ్ నగర్  జిల్లాలో నేటి నుండి ఏర్పాటు చేశారు.

ఈ చిత్ర ప్రదర్శనను జడ్చర్ల ఎంపిపి లక్ష్మి శంకర్ నాయక్జ‌డ్‌పిటిసి జయప్రద,  తహాశీల్దార్ లక్ష్మినారాయణ,  ఎమ్‌పిడిఒ జి. మున్ని  సమక్షంలో  రిబ్బన్ కట్/జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగాఅతిథులు మాట్లాడుతూ, పేదలగ్రామీణులయువకుల, మహిళలదళితులరైతుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించిందన్నారు. వాటి పైన ప్రజలలో అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు.  కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు ఉపయోగించుకొని లబ్ధి పొందాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఇలాంటి చిత్ర  ప్రదర్శనను ఏర్పాటు చేసిన  డిఎవిపి ని అభినందించారు.

 అలాగే 2014 తర్వాత ఎన్‌డిఎ  ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రజల జీవితాలలో గుణాత్మకమైన మార్పు వచ్చింది. తన మూడు సంవత్సరాల పాలన పైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన Narendramodi app ద్వారా ప్రజల అభిప్రాయాలు తెలియజేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

గత మూడు సంవత్సరాలలో జిఎస్ టీసర్జికల్ స్ట్రైక్అంతర్గత భద్రతను పటిష్ట పరచడంఆర్ధిక రంగాన్ని బలపరచడంద్ర‌వ్యోల్బ‌ణాన్ని నియంత్రణ చేయడంప్రపంచ పటంలో  భారత దేశ ప్రతిష్ట పెరగడంఅవినీతిరహిత  నీతివంతమైన పాలన‌ను అందించడం లాంటి అనేక విజయాల పైన ప్రజలలోఈ చిత్ర ప్రదర్శన ద్వారా  అవగాహన‌ను కల్పించడం ముఖ్య ఉద్దేశ్యం.

ఎంపిపి లక్ష్మి శంకర్ నాయక్  మాట్లాడుతూ, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరాయంగా ప్రజల సంక్షేమం కోసం ప్రతినిత్యం పనిచేస్తున్నాయ‌న్నారు. ప్రజలు దీనిని తెలుసుకొని లబ్ధి పొందితేనే ఆ పథకాలకు సార్ధకత చేకూరుతుంది అని తెలియచేశారు. రైతులుదళితులుమహిళలువిద్యార్థులుయువకులు చిత్ర ప్రదర్శనను సందర్శించి ప్రభుత్వ పథకాల పైన అవగాహను పెంచుకోవాలన్నారు.

ఈ 5 రోజుల ప్రదర్శనలో రైతులుభద్రత‌యువతమహిళ‌లుదృఢమైన ప్రభుత్వం లాంటి  అనేక అంశాలపైన 40 కి ప్యానెల్ బోర్డ్స్ లో అక్షరచిత్రాలతో రూపొందించడం జరిగింది.

అలాగే ఆప్టికల్ ఫైబర్ బ్రాడ్ బాండ్ నెట్ వర్క్ 358 కి.మీ. ల నుండి 2,05,404 కి.మీ. లకు చేరింది. పర్యాటక రంగంలో భారత్ 65వ స్థానం నుండి 40వ స్థానానికి ఎగబాకింది.  సోలార్ పవర్ సెక్టార్ లో భారత్ గణనీయమైన ప్రగతి సాధించిందిమార్చి  2014 లో 2621  ఎమ్‌డ‌బ్ల్యు ఉన్న సోలార్ పవర్ ఇన్స్టాల్ల్డ్ కెపాసిటీ నేడు 12277 ఎమ్‌డ‌బ్ల్యు కు చేరింది. 

డిఎవిపి ఎగ్జిబిషన్ ఆఫీసర్ సురేష్ ధర్మపురి ఈ సందర్భంగా మాట్లాడుతూకేంద్ర ప్రభుత్వం ఎన్నో మంచి మంచి సంక్షేమ పథకాలను చేపట్టి ప్రజల అభ్యున్నతి కి పాటుపడుతోంది. ప్రజలు తమ కోసం ఉన్న సంక్షేమ పథకాల పట్ల అవగహన పెంచుకొనిలబ్ధి పొందాలని కోరారు. ఈ నెల 24 వరకు జరిగే ఈ చిత్ర ప్రదర్శనను ప్రజలు సందర్శించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  ఈ కార్యక్రమంలో ఎమ్‌పిడిఒ ఆఫీస్ ఇన్ ఛార్జ్ లక్ష్మిఇతర సిబ్బంది పాల్గొన్నారు.  

 

 

***



(Release ID: 1513522) Visitor Counter : 197


Read this release in: English