PIB Headquarters

షాద్‌న‌గ‌ర్ లో డిఎవిపి ఎగ్జిబిష‌న్ ప్రారంభం

Posted On: 14 DEC 2017 6:31PM by PIB Hyderabad

షాద్‌న‌గ‌ర్ లో 5 రోజుల పాటు కొన‌సాగే డైరేక్ట‌ర్ ఆఫ్ అడ్వ‌ర‌టైజింగ్ అండ్ విజువ‌ల్‌ ప‌బ్లిసిటీ (డిఎవిపి) ఎగ్జిబిష‌న్ ను మండ‌ల పంచాయ‌తీ అభివృద్ధి కార్యాల‌యంలో ఈ రోజు షాద్‌న‌గ‌ర్ ఆర్‌డిఒ శ్రీ ఎమ్‌. కృష్ణ ప్రారంభించారు.  ‘‘సాత్ హై విశ్వాస్ హై, హో ర‌హా వికాస్ హై’’ (చెంత న‌మ్మ‌కం ఉంది, అభివృద్ధి జ‌రుగుతోంది) అనేది ఈ ఎగ్జిబిష‌న్ కు ప్ర‌ధాన ఇతివృత్తంగా ఉంది.  ఈ సంద‌ర్భంగా శ్రీ ఎం. కృష్ణ మాట్లాడుతూ, ప్రభుత్వ ప‌థ‌కాల‌ను వినియోగించుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.  ఈ త‌ర‌హా ఎగ్జిబిష‌న్‌లు ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల గురించి ప్ర‌జ‌ల‌లో చైత‌న్యాన్ని పెంపొందింప చేయ‌డంలో తోడ్ప‌డుతాయ‌ని ఆయ‌న అన్నారు.  ఈ ఎగ్జిబిష‌న్ వ‌స్తువులు మ‌రియు సేవ‌ల ప‌న్ను (జిఎస్‌టి), రైతుల కోసం, ఆర్థికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాలు, మ‌హిళ‌లు మ‌రియు బాల‌ల కోసం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలతో పాటు, స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ వంటి ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు మ‌రియు విజ‌యాలను చాటి చెబుతోంది. 

ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్‌పిపి శ్రీ‌మ‌తి బుజ్జిబాబు నాయ‌క్‌, షాద్‌న‌గ‌ర్ ఎంపిడిఒ శ్రీ‌మ‌తి రాజేశ్వ‌రి, ఇఆర్‌డిఒ శ్రీ‌మ‌తి సుమిత్ర ల‌తో పాటు ఎమ్ఇఒ శ్రీ శంక‌ర్ రాథోడ్ కూడా పాల్గొన్నారు.  ఫీల్డ్ ఎగ్జిబిష‌న్‌ ఆఫీస‌ర్ శ్రీ సురేశ్ ధ‌ర్మ‌పురి తొలుత స‌భికుల‌కు స్వాగ‌తం ప‌లికారు.

****



(Release ID: 1512639) Visitor Counter : 80


Read this release in: English