మంత్రివర్గ సంఘం చర్చలు
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో శ్రామికులకు 8వ దఫా వేతన సంప్రదింపుల కోసం ఉద్దేశించిన వేతన విధానానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
23 NOV 2017 2:53PM by PIB Hyderabad
సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ ప్రైజెస్ (సిపిఎస్ఇ స్ ) యొక్క శ్రామికుల ‘వేజ్ పాలిసీ ఫర్ ది 8త్ రౌండ్ ఆఫ్ వేజ్ నెగోశియేషన్స్’ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ప్రధానాంశాలు:
i. అయిదు సంవత్సరాల లేదా పది సంవత్సరాల నిర్ణీత కాలికత కలిగిన వేతన ఒప్పందం సాధారణంగా 31.12.2016 నాడు ముగిసిన పక్షంలో అటువంటి సిపిఎస్ఇ ల యాజమాన్యాలకు వాటి శ్రామికుల వేతనాలలో సవరణ కోసం సంప్రతింపులు జరిపేందుకుగాను స్వేచ్ఛను ఇవ్వడం జరుగుతుంది. అయితే అటువంటి వేతన సవరణ సంప్రతింపులనేవి సంబంధిత సిపిఎస్ఇ ల యొక్క భరించగలిగే తాహతును మరియు వాటికి ఆర్థికంగా గల నిలదొక్కుకొనే సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సాగవలసి ఉంటుంది.
ii. ఎటువంటి వేతన పెరుగుదలకైనా ప్రభుత్వం బడ్జెట్ పరంగా ఏ విధమైన మద్దతునూ అందించబోదు. యావత్తు ఆర్థిక భారాన్ని సంబంధిత సిపిఎస్ఇ లు వాటి అంతర్గత వనరుల నుండి భరించవలసి ఉంటుంది.
iii. ప్రభుత్వం ఆమోదించినటువంటి సిపిఎస్ఇ ల పునర్ వ్యవస్థీకరణ/పునరుద్ధరణ ప్రణాళిక ల విషయంలో, వేతన సవరణ అనేది ఆయా ఆమోదిత పునర్ వ్యవస్థీకరణ /పునరుద్ధరణ ప్రణాళిక ల నిబంధనలకు అనుగుణంగా మాత్రమే జరగవలసి ఉంటుంది.
iv. సంప్రతింపులు జరిగిన వేతన స్కేళ్ళు ప్రస్తుతం అమలవుతున్న ఎగ్జిక్యూటివ్ లు/అధికారులు మరియు నాన్- యూనియనైజ్ డ్ సూపర్‌వైజర్ లకు ఇప్పుడు ఉన్నటువంటి పే స్కేల్స్ ను మించకుండా తగిన జాగ్రత్తలను సంబంధిత సిపిఎస్ఇ ల యాజమాన్యం తీసుకోవలసి ఉంటుంది.
v. అయిదు సంవత్సరాల నిర్ణీత కాలికతను అనుసరించే సిపిఎస్ఇ ల యాజమాన్యం క్రమానుగతంగా చేపట్టిన రెండు వేతన సంప్రతింపుల తాలూకు అంగీకారం కుదిరిన పే స్కేళ్ళు పది సంవత్సరాల నిర్ణీత కాలికత ను అనుసరిస్తున్నటు వంటి ఆయా సిపిఎస్ఇ ల ఎగ్జిక్యూటివ్ లు/అధికారులు మరియు నాన్- యూనియనైజ్ డ్ సూపర్‌వైజర్ ల ప్రస్తుత పే స్కేళ్ళను మించకుండా తగిన జాగ్రత్తలను సంబంధిత సిపిఎస్ఇ ల యాజమాన్యం తీసుకోవలసి ఉంటుంది.
vi. ఎగ్జిక్యూటివ్ లు/నాన్- యూనియనైజ్ డ్ సూపర్‌వైజర్ ల పే స్కేల్స్ వారి వర్క్ మెన్ పే స్కేల్స్ తో సంఘర్షించకుండా ఉండడం కోసం సిపిఎస్ఇ లు దశల వారీ డిఎ తటస్థీకరణను మరియు /లేదా గ్రేడెడ్ ఫిట్‌మెంట్ అడాప్షన్ ను పరిశీలించ వచ్చు.
vii. సంప్రతింపుల అనంతరం వేతనాలలో ఏదైనా పెరుగుదల చోటు చేసుకోవడం వల్ల సిపిఎస్ఇ లు వాటి వస్తువులు మరియు సేవల నియంత్రిత ధరలు ఎగబాకకుండా తగిన జాగ్రత్తలను తీసుకోవలసి ఉంటుంది.
viii. అవుట్ పుట్ యొక్క యూనిట్ వారీ శ్రామిక ఖర్చులో పెరుగుదల ఉండని విధంగా వేతన సవరణ వర్తింపు జరగవలసి ఉంటుంది. ఈసరికే గరిష్ఠ సామర్థ్యంతో పనిచేస్తున్న అసామాన్య సిపిఎస్ఇ ల విషయానికి వస్తే, పరిశ్రమ నిబంధనలను పరిగణన లోకి తీసుకొని పాలక మంత్రిత్వ శాఖ గాని లేదా విభాగం గాని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (డిపిఇ) ని సంప్రదించవచ్చు.
ix. అయిదు సంవత్సరాల నిర్ణీత కాలికత వైపు మొగ్గు చూపిన వారి విషయంలో వేతన ఒప్పందం యొక్క చెల్లుబాటు వ్యవధి కనీసం అయిదు సంవత్సరాలుగా ఉంటుంది. 01.01.2017 నాటి నుండి వర్తించే విధంగా పది సంవత్సరాల నిర్ణీత కాలికత వైపు మొగ్గిన వారి విషయంలో వేజ్ సెటిల్‌మెంట్ వ్యవధి గరిష్ఠంగా పది సంవత్సరాలుగా ఉంటుంది.
x. సిపిఎస్ఇ లు వేతన సవరణ ఆమోదిత పరామితులకు అనుగుణంగా ఉన్నదని వాటి పాలక మంత్రిత్వ శాఖతో లేదా విభాగంతో నిర్ధారించుకొన్న తరువాత నూతన వేతనాలను ఆమలుచేస్తాయి.
పూర్వరంగం:
దేశంలో 320 సిపిఎస్ఇ లలో రమారమి 12.34 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో దాదాపు 2.99 లక్షల మంది ఉద్యోగులు బోర్డు స్థాయి మరియు బోర్డు స్థాయి కన్నా తక్కువ స్థాయి ఎగ్జిక్యూటివ్ లు, ఇంకా నాన్- యూనియనైజ్ డ్ సూపర్‌వైజర్ లు. మిగిలిన 9.35 లక్షల మంది ఉద్యోగులు యూనియనైజ్ డ్ వర్క్ మెన్ కేటగిరీ లోకి వస్తారు. యూనియనైజ్ డ్ వర్క్ మెన్ విషయంలో వేతన సవరణ ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (డిపిఇ) వేతన సంప్రదింపుల కోసం జారీ చేసిన మార్గదర్శక సూత్రాల వెలుగులో సిపిఎస్ఇ ల యాజమన్యాలు మరియు కార్మిక సంఘాలు నిర్ణయిస్తాయి.
***
(Release ID: 1510607)
Backgrounder release reference
Cabinet approves Wage Policy for the 8th Round of Wage Negotiations for workmen in Central Public Sector Enterprises