మంత్రిమండలి
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లో భాగంగా మధ్య ఆదాయ వర్గాలకు ఉద్దేశించినటువంటి క్రెడిట్ లింక్ డ్ సబ్సిడీ స్కీము కింద వడ్డీ సబ్సిడీకి అర్హత కలిగిన గృహాల కార్పెట్ ఏరియా లో పెంపుదలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
16 NOV 2017 5:47PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) లో భాగంగా మధ్య ఆదాయ వర్గాల వారి (ఎమ్ఐజి) కి ఉద్దేశించినటువంటి క్రెడిట్ లింక్ డ్ సబ్సిడీ స్కీమ్ (సిఎల్ఎస్ఎస్) కింద వడ్డీ సబ్సిడీ కి అర్హత కలిగిన గృహాల కార్పెట్ ఏరియా పెంపుదలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ పథకం యొక్క లక్ష్యాన్ని, లబ్ధిదారులను మరియు వ్యాప్తిని మరింత విస్తృతం చేసేందుకుగాను మంత్రివర్గం ఈ కింది అంశాలను ఆమోదించింది:
i. సిఎల్ఎస్ఎస్ యొక్క ఎమ్ఐ జి- I కేటగిరీ కి చెందిన కార్పెట్ ఏరియా ను ప్రస్తుతం ఉన్నటువంటి 90 చదరపు మీటర్ల నుండి ‘‘120 చదరపు మీటర్ల వరకు’’ పెంచడంతో పాటు, సిఎల్ఎస్ఎస్ లోని ఎమ్ఐజి - II కేటగిరీ కి సంబంధించి కార్పెట్ ఏరియా ను ఇప్పుడు ఉన్న 110 చదరపు మీటర్ల నుండి ‘‘150 చదరపు మీటర్ల వరకు’’ పెంచడం; ఇంకా
ii. పైన ప్రస్తావించిన మార్పు ను 2017 జనవరి 1వ తేదీ నాటి నుండి అంటే- ఎమ్ఐజి కి సిఎల్ఎస్ఎస్ ను వర్తింపజేసిన తేదీ నాటి నుండి అమలు లోకి తీసుకురావడం.
నగర ప్రాంతాలలో గృహ వసతికి ఉన్న కొరతను తీర్చే దిశగా ఎమ్ఐజి కి సిఎల్ఎస్ఎస్ అనేది ఒక సంస్కరణాత్మక నిర్ణయం. అంతేకాకుండా ఇది వడ్డీ సబ్సిడీ పథకం తాలూకు ప్రయోజనాలను మధ్య ఆదాయ వర్గాల వారు పొందేందుకు వీలుగా వేసిన ఒకటో అడుగు.
ఎమ్ఐజి వర్గాలకు ఉద్దేశించిన సిఎల్ఎస్ఎస్ రెండు ఆదాయ విభాగాల కు అంటే- సంవత్సరానికి రూ. 6,00,001 నుండి రూ.12,00,000 (ఎమ్ఐజి-I) మరియు సంవత్సరానికి రూ. 12,00,001 నుండి రూ. 18,00,000 (ఎమ్ఐజి-II) లకు- వర్తిస్తుంది. ఎమ్ఐజి-I లో రూ. 9 లక్షల వరకు రుణ మొత్తాలకు గాను 4 శాతం వడ్డీ సబ్సిడీని పొందుపరచగా, రూ. 12 లక్షల వరకు రుణ మొత్తానికి 3 శాతం వడ్డీ సబ్సిడీని పొందుపరచడం జరిగింది. 20 సంవత్సరాల గరిష్ఠ రుణ కాలానికి లేదా వాస్తవ కాలానికి.. వీటిలో ఏది తక్కువైతే దాని ప్రకారం.. 9 శాతం ఎన్‌పివి రూపంలో వడ్డీ సబ్సిడీని గుణించడం జరుగుతుంది. 9 లక్షల రూపాయలు మరియు 12 లక్షల రూపాయలకు మించిన గృహ రుణాలకు నాన్- సబ్సిడైజ్ డ్ రేటులు ఉంటాయి.
ఎమ్ఐజి వర్గాలకు సిఎల్ఎస్ఎస్ ప్రస్తుతం 2019 మార్చి నెల 31వ తేదీ వరకు అమలులో ఉంటుంది.
ప్రభావం:
• 120 చదరపు మీటర్లు మరియు 150 చదరపు మీటర్ల పరిమితి ని ఒక సహేతుకమైన పెంపుదలగా భావిస్తున్నారు. ఇది ఈ పథకంలో పేర్కొన్న నిర్దిష్ట ఆదాయ కేటగిరీ లకు చెందిన వారు సాధారణంగా వెదకే ఇళ్ళ మార్కెట్ యొక్క అవసరాలను తీర్చగలుగుతుంది.
• కార్పెట్ ఏరియా లో పెంపుదల డెవలపర్ల ప్రాజెక్టుల పరంగా విస్తృతమైన ఎంపికలను ఎమ్ఐ కేటగిరీ వ్యక్తులకు అందుబాటులోకి తీసుకు వస్తుంది.
• కార్పెట్ ఏరియా లో పెంపుదల తక్కువ వ్యయం అయ్యే గృహాల విభాగంలో నిర్మాణం పూర్తి అయిన ఫ్లాట్ ల విక్రయానికి మార్గాన్ని సుగమం చేయగలుగుతుంది.
పూర్వరంగం:
మాన్య ప్రధాన మంత్రి 2016 డిసెంబర్ 31వ తేదీన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, గృహ రుణాలను తీసుకొంటున్న పేద ప్రజలకు మరిన్ని ప్రయోజనాలను కల్పిస్తామని, అంతే కాక మధ్య ఆదాయ వర్గాల వారి (ఎమ్ఐజి)కి గృహ నిర్మాణ రుణాల కోసం ఒక కొత్త వడ్డీ సబ్సిడీ పథకాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. దీనికి అనుగుణంగా గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2017 జనవరి 1 నాటి నుండి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) లో భాగంగా మధ్య ఆదాయ వర్గాల వారి కోసం క్రెడిట్ లింక్ డ్ సబ్సిడీ స్కీము ను అమలు చేస్తోంది.
***
(Release ID: 1509832)