మంత్రిమండలి

ఆదాయంపై ప‌న్ను విష‌యంలో ఆర్థిక ఎగ‌వేత‌ల నిరోధం మ‌రియు రెండు సార్లు ప‌న్ను విధింపు నివార‌ణ‌ ల కోసం భార‌త‌దేశానికి, హాంగ్ కాంగ్ స్పెష‌ల్ అడ్మినిస్ట్రేటివి రీజియ‌న్ ఆఫ్ చైనా కు మ‌ధ్య ఒప్పందాన్ని ఆమోదించిన మంత్రివ‌ర్గం

Posted On: 11 NOV 2017 4:25PM by PIB Hyderabad

ఆదాయంపై ప‌న్ను విష‌యంలో ఆర్థిక ఎగ‌వేత‌ల నిరోధం మ‌రియు రెండు సార్లు ప‌న్ను విధింపు నివార‌ణ‌ ల కోసం హాంగ్ కాంగ్ స్పెష‌ల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియ‌న్ (హెచ్‌కెఎస్ఎఆర్‌) ఆఫ్ చైనా తో భార‌త‌దేశం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.

పెట్టుబ‌డులు, సాంకేతిక విజ్ఞానం, ఇంకా సిబ్బంది భార‌త‌దేశం నుండి హెచ్‌కెఎస్ఎఆర్ కు మ‌రియు అటువైపు నుండి ఇటు వైపుకు రాక‌పోక‌లు జ‌ర‌ప‌డానికి ఈ ఒప్పందం వెసులుబాటు క‌ల్పిస్తుంది. ఒప్పందం కుదుర్చుకొనే ఉభయ ప‌క్షాల మ‌ధ్య రెండు సార్లు ప‌న్ను విధింపును నివారించి సంబంధిత స‌మాచారాన్ని ప‌ర‌స్ప‌రం మార్పిడి చేసుకోవ‌డానికి కూడా ఈ ఒప్పందం మార్గాన్ని సుగ‌మం చేస్తుంది. ప‌న్నుల వ్య‌వ‌హారాల‌లో పార‌ద‌ర్శ‌క‌త్వాన్ని ఇది మెరుగు ప‌రుస్తుంది. అంతేకాకుండా, ప‌న్నుల ఎగ‌వేత‌లను అరికట్టడంతో పాటు ప‌న్నులు చెల్లించ‌కుండా త‌ప్పించుకోవ‌డాన్ని నిరోధించడంలో సైతం తోడ్ప‌డుతుంది.



పూర్వ‌రంగం:

భార‌త‌దేశానికి సంబంధించినంత వ‌ర‌కు చూస్తే, ఏదైనా విదేశంతో లేదా నిర్ధిష్ట ప్రాంతంతో రెండు సార్లు ఆదాయ ప‌న్ను విధింపు యొక్క నివార‌ణ కోసం ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం, 1961లో భాగంగా విధించ‌ద‌గ్గ ఆదాయ‌పు ప‌న్ను యొక్క ఎగ‌వేతల నివార‌ణ, లేదా ఆ విధ‌మైన ప‌న్ను ను చెల్లించకుండా త‌ప్పించుకోవ‌డం ల‌కు సంబంధించిన స‌మాచారాన్ని ఇరు పక్షాలు మార్పిడి చేసుకోవ‌డానికి- ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం, 1961లోని 90 సెక్ష‌న్ ప్రకారం- కేంద్ర ప్ర‌భుత్వానికి అధికారం ఉంది. ఇత‌ర దేశాల‌తో భార‌త‌దేశం ఇదే మాదిరి కుదుర్చుకున్న ఒప్పందాల కోవ‌లోనే ఈ ఒప్పందం కూడా ఉంది. 
 

*****



(Release ID: 1509066) Visitor Counter : 81


Read this release in: English