మంత్రిమండలి
పెట్టుబడులకు ప్రోత్సాహం మరియు వాటికి రక్షణ అనే అంశాలపై భారతదేశానికి, కొలంబియాకు మధ్య 2009 నవంబర్ 10వ తేదీన సంతకాలైన ఒక ఒప్పందానికి సంబంధించి జాయింట్ ఇంటర్‌ప్రిటేటివ్ డిక్లరేశన్ ను ఆమోదించిన మంత్రివర్గం
Posted On:
11 NOV 2017 4:16PM by PIB Hyderabad
పెట్టుబడుల ప్రోత్సాహం మరియు రక్షణ అంశాలపై భారతదేశానికి, కొలంబియాకు మధ్య 2009 నవంబర్ 10వ తేదీన సంతకాలు జరిగి ప్రస్తుతం అమలులో ఉన్న ఒప్పందానికి సంబంధించిన జాయింట్ ఇంటర్‌ప్రిటేటివ్ డిక్లరేశన్ (జెఐడి) పై సంతకాలు చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ జెఐడి ఇప్పటికే అమలవుతున్న ఒప్పందానికి భాష్యం చెప్పడంలో స్పష్టతను తీసుకు వస్తుంది. పెట్టుబడిదారు యొక్క నిర్వచనం, పెట్టుబడి యొక్క నిర్వచనం, ఫేర్ అండ్ ఈక్విటబుల్ ట్రీట్ మెంట్ (ఎఫ్ఇటి), నేషనల్ ట్రీట్‌మెంట్ (ఎన్‌టి) అండ్ మోస్ట్ ఫేవర్ డ్ నేషన్ (ఎమ్ఎఫ్ఎన్) ట్రీట్ మెంట్, ఎక్స్‌ప్రోప్రియేశన్, ఇన్వెస్టర్- స్టేట్ డిస్‌ప్యూట్ సెటిల్‌మెంట్ ప్రొవిజన్ అండ్ డినయల్ ఆఫ్ బెనిఫిట్స్ లతో సహా అనేక క్లాజులను సంయుక్తంగా ఆమోదించడానికి పరిగణన లోకి తీసుకోవలసిన వివరణాత్మకమైన నోట్స్ ను ఈ జెఐడి లో పొందుపరచడం జరుగుతుంది.
జాయింట్ ఇంటర్‌ప్రిటేటివ్ డిక్లరేశన్స్/స్టేట్‌మెంట్స్ సాధారణంగా ఇన్వెస్ట్‌మెంట్ ట్రీటీ రెజీమ్ ను పటిష్టపరచడంలో ఒక ముఖ్యమైన అనుబంధ పాత్రను పోషిస్తాయి. ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం (బిఐటి) సంబధ వివాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో, ఈ తరహా స్టేట్ మెంట్ ల జారీ మధ్యవర్తిత్వ విచారణ సంఘాల సమక్షంలో బలమైన ఒప్పించే విలువను సంతరించుకొనేందుకు అవకాశం ఉంది. భాగస్వాములు ఈ విధమైన ప్రొ-యాక్టివ్ వైఖరిని అవలంభించడం వల్ల మధ్యవర్తిత్వ విచారణ సంఘాలు ఒప్పందం లోని అంశాలను మరింత సమగ్రంగాను, భావి సూచనలతోను పరిశీలించేందుకు అవకాశం ఏర్పడుతుంది.
*****
(Release ID: 1509061)
Visitor Counter : 107