ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి తో సమావేశమైన పసిఫిక్ పెన్షన్ అండ్ ఇన్ వెస్ట్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ కు చెందిన ప్రతినిధి వర్గం
Posted On:
07 NOV 2017 1:00PM by PIB Hyderabad
పసిఫిక్ పెన్షన్ అండ్ ఇన్ వెస్ట్‌మెంట్ (పిపిఐ) ఇన్‌స్టిట్యూట్ కు చెందిన ఒక ప్రతినిధి వర్గం ఆ సంస్థ అధ్యక్షుడు శ్రీ లయనెల్ సి. జాన్ సన్ నాయకత్వంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు సమావేశమైంది.
ప్రతినిధి వర్గం సభ్యులు భారతదేశంలో ఆర్థిక సంస్కరణల జోరును కొనియాడారు; దేశంలో చక్కటి వృద్ధికి ఆస్కారం ఉందంటూ వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు. చర్చలో ఆర్థిక వ్యవస్థకు చెందిన ఎఫ్‌డిఐ, జిఎస్‌టి ల వంటివేరు వేరు అంశాలు చోటు చేసుకొన్నాయి.
భారతదేశంలో పెట్టుబడులకు ఉన్న వివిధ అవకాశాలను గురించి ప్రధాన మంత్రి వివరించారు. ఇటీవల ప్రవేశపెట్టిన సంస్కరణలను గురించి మరియు వ్యాపారం చేయడాన్ని సులభతరంగా మార్చేందుకు చేపట్టిన చర్యలను గురించి ఆయన తెలియజేశారు. భారతదేశపు ప్రజలలో నానాటికీ పెరుగుతున్న ఆకాంక్షలతో పాటు దృఢంగా ఉన్న ఆర్థిక పునాదులు పెట్టుబడికి ఒక గణనీయమైన అవకాశం ఉందంటూ సూచిస్తున్నాయని ఆయన చెప్పారు. నవీకరణ యోగ్య శక్తి మరియు సేంద్రియ సాగు రంగాలలో పెట్టుబడికి ఉన్న పరిధిని గురించి ఆయన నొక్కిపలికారు. పిపిఐ ఇన్‌స్టిట్యూట్ తన వద్ద ఉన్న నిధులను ఒక ధర్మకర్త మాదిరిగా పెట్టుబడి పెడుతూ ఉండడాన్ని ఆయన ప్రశంసించారు. అంతేకాకుండా, ఈ విధమైన ధర్మకర్తృత్వ భావనను భారతదేశంలో చాలా చక్కగా అర్థం చేసుకొంటారని, మహాత్మ గాంధీ గారు సైతం ఇదే భావాన్ని ప్రకటించారని ప్రతినిధి వర్గం దృష్టికి ప్రధాన మంత్రి తీసుకువచ్చారు.
***
(Release ID: 1508487)
Visitor Counter : 79