PIB Headquarters

డిప్లొమా ఇన్ ఎలిమెంట‌రీ ఎడ్యుకేష‌న్ (డి.ఇఎల్‌.ఇడి) లో ప్ర‌వేశం పొందుట‌కు 1 న‌వంబ‌ర్ నుండి 7 న‌వంబ‌ర్ 2017 వ‌ర‌కు మ‌రొక అవ‌కాశం

Posted On: 31 OCT 2017 6:34PM by PIB Hyderabad

1 నుండి 8వ త‌ర‌గ‌తి వ‌ర‌కు ప్ర‌భుత్వ‌/ప‌్ర‌భుత్వ ఎయిడెడ్ మ‌రియు ప్రైవేటు పాఠ‌శాల‌లలో బోధిస్తున్న శిక్ష‌ణ పొంద‌ని ఎలిమెంట‌రీ స్థాయి పాఠ‌శాల‌ల ఉపాధ్యాయుల‌కు 31 మార్చి 2019 లోపుగా డిప్లొమా ఇన్ ఎలిమెంట‌రీ ఎడ్యుకేష‌న్ (డి.ఇఎల్‌.ఇడి) పూర్తి చేయుట‌కు గాను భార‌త ప్ర‌భుత్వంనేష‌న‌ల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఒఎస్‌) ద్వారా 16 ఆగ‌స్టు నుండి 30 సెప్టెంబ‌ర్ 2017 వ‌ర‌కు న‌మోదు కొర‌కు ఒక అవ‌కాశాన్ని క‌ల్పించింది.  అయినా దీనిలో ప్ర‌వేశం పొందలేకపోయిన శిక్ష‌ణ పొంద‌ని ఎలిమెంట‌రీ స్థాయి పాఠ‌శాల‌ల ఉపాధ్యాయుల‌కు డిప్లొమా ఇన్ ఎలిమెంట‌రీ ఎడ్యుకేష‌న్ (డి.ఇఎల్‌.ఇడి) లో ప్ర‌వేశం పొందుట‌కు మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ‌భార‌త ప్ర‌భుత్వం 1 న‌వంబ‌ర్ నుండి 7 న‌వంబ‌ర్ 2017 వ‌ర‌కు మ‌రొక అవ‌కాశం క‌ల్పించింది.  శిక్ష‌ణ పొంద‌ని ఎలిమెంట‌రీ స్థాయి పాఠ‌శాల‌ల ఉపాధ్యాయుల న‌మోదు కోసం dled.nios.ac.in లేదా ఎన్ఐఒఎస్ వెబ్‌సైట్ www.nios.ac.in ను ద‌ర్శించ‌వ‌చ్చు.  NIOS_D_El_Ed mobile app ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్  చేసుకొన‌వ‌చ్చు.

ఈ అవ‌కాశాన్ని శిక్ష‌ణ పొంద‌ని ఎలిమెంట‌రీ స్థాయి పాఠ‌శాల‌ల ఉపాధ్యాయులు స‌ద్వినియోగ ప‌ర‌చుకొని డిప్లొమా ఇన్ ఎలిమెంట‌రీ ఎడ్యుకేష‌న్ (డి.ఇఎల్‌.ఇడి) లో ప్ర‌వేశం పొంద‌గ‌ల‌ర‌ని ఎన్ ఐఒఎస్ ప్రాంతీయ సంచాల‌కులు అనిల్ కుమార్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

 

 

***



(Release ID: 1507628) Visitor Counter : 61


Read this release in: English