మంత్రిమండలి
ఢిల్లీ లో మధ్య ప్రదేశ్ రాష్ట్ర అతిథి గృహ నిర్మాణానికి మధ్య ప్రదేశ్ ప్రభుత్వానికి భూమిని కేటాయించేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
23 AUG 2017 6:57PM by PIB Hyderabad
ఢిల్లీ లో మధ్య ప్రదేశ్ ప్రభుత్వ అతిథి గృహాన్ని నిర్మించడానికి న్యూ ఢిల్లీ లోని చాణక్యపురిలో ఉన్న డాక్టర్ రాధాకృష్ణన్ మార్గ్, మరియు జీసస్ అండ్ మేరీ మార్గ్ లతో కూడివున్న టి-జంక్షన్ వద్ద 1.478 ఎకరాలు లేదా 5882.96 చదరపు మీటర్ల మేర విస్తరించిన ప్లాట్ నంబర్ 29-C & 29-D భూమిని ఈ కింద పేర్కొన్న షరతులతో ప్రస్తుతం చలామణిలో ఉన్న రేట్ల ప్రకారం మధ్య ప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
(i) మధ్య ప్రదేశ్ ప్రభుత్వం తనకు కేటాయించిన స్థలంలో తమ స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం పూర్తి అయిన తరువాత న్యూ ఢిల్లీ లో 2, గోపినాథ్ బార్దోలాయ్ మార్గ్, చాణక్యపురి లోని 0.89 ఎకరాల భూమిని L&DO/MoHUA కు వదులుకొంటుంది.
(ii) రెండు స్థలాలు ఒకే భూమి రేట్ల జోన్‌కు చెందివున్న కారణంగా, 0.59 ఎకరాలకు భూమికి గాను వ్యత్యాసంగా ఉన్న విలువను మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుత భూ విలువల ప్రకారం చెల్లిస్తుంది.
(iii) అలాగే మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే తన స్వాధీనంలో ఉన్న 0.89 ఎకరాలకుగాను ఆక్యుపేషన్ చార్జీలను ప్రస్తుత భూమి రేట్లను అనుసరించి- ఆ స్థలాన్ని L&DO/MoHUA కు వదలుకునేంత వరకు- చెల్లిస్తుంది.
మధ్య ప్రదేశ్ ప్రభుత్వ తన స్టేట్ గెస్ట్ హౌస్ ను ప్రస్తుత మరియు భావి అవసరాలను దృష్టిలో పెట్టుకొని అన్ని ఆధునిక సదుపాయాలతోనూ నిర్మించుకొనేందుకు ఈ భూమి కేటాయింపు మధ్య ప్రదేశ్ ప్రభుత్వానికి ఉపయోగపడనుంది.
ఈ భూమిని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం తన స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం కాకుండా మరే పనికీ వినియోగించదు. భవనాన్ని నిర్మించేటప్పుడు, మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుత భవన నిర్మాణ ఉప నిబంధనలన్నింటినీ, విపుల ప్రణాళిక నియమాల వంటి వాటిని కూడా అనుసరిస్తుంది.
***
(Release ID: 1500508)
Visitor Counter : 97