మంత్రిమండలి

ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు ఒక ఆల్ట‌ర్ నేటివ్ మెకానిజ‌మ్ (ఎఎమ్) ద్వారా విలీనం కావడానికి సూత్ర రీత్యా ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 23 AUG 2017 6:43PM by PIB Hyderabad

ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు ఒక ఆల్ట‌ర్నేటివ్ మెకానిజ‌మ్ (ఎఎమ్‌) ద్వారా విలీన‌ం కావడానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం సూత్ర రీత్యా ఆమోదం తెలిపింది.  ఈ నిర్ణ‌యం జాతీయ బ్యాంకులు వాటి మ‌ధ్య దృఢమైన మ‌రియు స్ప‌ర్దాత్మ‌క బ్యాంకుల‌ను ఏర్పాటు చేయ‌డానికి సుసంఘ‌టితం అయ్యేందుకు వీలు క‌ల్పిస్తుంది. 
 
ప్ర‌ధానాంశాలు:
 

          ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు సుసంఘ‌టితం కావ‌డానికి ఉద్దేశించిన ఒక ఫ్రేమ్ వ‌ర్క్‌కు, ఈ కింద పేర్కొన్న ప్ర‌ధానాంశాల ప్ర‌కారం ఆమోదాన్ని తెలియ‌జేయ‌డ‌మైంది:
 
-         అచ్చంగా వ్యాపార‌ప‌ర‌మైన అంశాల ఆధారంగానే బ‌ల‌మైన మ‌రియు స్ప‌ర్ధాత్మ‌క బ్యాంకుల‌ను ఏర్పాటు చేయ‌డానికి సంబంధించిన నిర్ణ‌యం తీసుకోబ‌డుతుంది.
 
-         ఈ ప్ర‌తిపాద‌న బ్యాంకుల బోర్డుల స్థాయిలోనే ఆరంభం కావ‌ల‌సి ఉంటుంది.
 
-         విలీన ప‌థ‌కాల‌ను రూపొందించ‌డానికి బ్యాంకుల నుండి అందే ప్ర‌తిపాద‌న‌ల‌కు సూత్ర రీత్యా ఆమోదం అనే అంశాన్ని ది ఆల్ట‌ర్నేటివ్ మెకానిజ‌మ్ (ఎఎమ్‌) ప‌రిశీల‌న‌కు నివేదించాలి.

-        సూత్ర రీత్యా ఆమోదం ల‌భించిన అనంతరం, బ్యాంకులు చ‌ట్ట ప్ర‌కారంగాను మ‌రియు సెబీ (SEBI) విధి విధానాలకు అనుగుణంగాను చ‌ర్య‌లు తీసుకొంటాయి.

-        తుది ప‌థ‌కాన్ని కేంద్ర ప్ర‌భుత్వం భార‌తీయ రిజ‌ర్వు బ్యాంకును సంప్ర‌దించి, నోటిఫై చేస్తుంది.
 
పూర్వ‌రంగం:
 
భార‌త‌దేశం త‌క్కువ సంఖ్య‌లోనే అయిన‌ప్ప‌టికీ బ‌ల‌మైన ప్ర‌భుత్వ‌రంగ బ్యాంకుల‌ను క‌లిగి వుండాల‌న్న సూచ‌న 1991లో వ‌చ్చింది.  అయితే, ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు ఏకీక‌ర‌ణం కావ‌డానికి త‌గిన చ‌ర్య‌లు 2016 మే నెల‌లో గాని మొద‌ల‌వలేదు.  ఆ స‌మ‌యంలోనే, ఆరు బ్యాంకుల‌ను భార‌తీయ స్టేట్ బ్యాంక్‌ (ఎస్‌బిఐ) లోకి విలీనం చేస్తూ ఒక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది.  ఈ విలీనం అంత క్రితం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ మ‌రియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర ల విలీనం మాదిరిగా కాకుండా, రికార్డు స‌మ‌యంలో పూర్తి అయింది.
 
ఎస్‌బిఐ ప్ర‌స్తుతం సుమారు 24000 శాఖ‌లు, 59000కు పైగా ఎటిఎమ్‌లు, 6 ల‌క్ష‌ల పిఒఎస్ యంత్రాలు మ‌రియు 50,000 ల‌కు పైగా బిజినెస్ కర‌స్పాండెంట్‌ల‌ను క‌లిగివున్న ఒకే ఒక బ్యాంకుగా ఉంది.  ఈ బ్యాంకు దేశంలోని మారుమూల ప్రాంతాల‌తో స‌హా అన్ని ప్రాంతాల‌కు త‌న సేవ‌లను అందిస్తోంది.  నిజానికి ఎస్‌బిఐ నెట్‌వ‌ర్క్‌లో 70 శాతం గ్రామీణ మ‌రియు సెమి- అర్బ‌న్ ప్రాంతాల‌లోనే ఉన్నాయి.  ఈ కోణంలో నుండి చూసినప్పుడు, ఈ బ్యాంకు ఏకీకృత బ్యాంకింగ్ సంస్కృతి ద్వారా భార‌త‌దేశాన్ని ఏకం చేయ‌డానికి శ్ర‌మిస్తోంది.  అంతేకాకుండా ఈ బ్యాంకుకు అంత‌ర్జాతీయంగా కూడా ప్రాముఖ్యం ఉంది;  ఇది ప్ర‌పంచంలో అతిపెద్ద బ్యాంకుల‌లో ఒక బ్యాంకుగా పేరు తెచ్చుకుంది.  ఈ బ్యాంకు ప‌రిమాణం, ఆర్థిక శ‌క్తి మ‌రియు వ్యాప్తి.. ఇవ‌న్నీ క‌లిసి బ్యాంకు వినియోగ‌దారుల‌కు, అన్ని టైమ్ జోన్‌ల‌లోను చాలా విస్తృత‌మైన‌టువంటి బ్యాంకింగ్ సేవ‌ల‌ను అత్యుత్త‌మ సాంకేతిక విజ్ఞానం స‌హాయంతో అందుకొనే సౌల‌భ్యాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌ల్పిస్తున్నాయి.  ఎస్‌బిఐ వి అతి త‌క్కువ రుణ రేట్లు కావడంతో చిన్న వ్యాపారుల‌కు మ‌రియు రైతుల‌కు చౌక‌గా రుణాలు ల‌భిస్తున్నాయి.  8.6 ల‌క్ష‌ల‌కు పైగా వర్తకులు 'భీమ్ ఆధార్‌' (BHIM Aadhaar), 'భార‌త్ క్యుఆర్' (Bharat QR) మ‌రియు 'పిఒఎస్' (POS)ల‌ను ఉప‌యోగిస్తూ ఉండ‌టంతో డిజిట‌ల్ బ్యాంకింగ్ పాద ముద్ర అంత‌కంత‌కు విస్త‌రిస్తోంది.  ఎస్‌బిఐ 15,000 కోట్ల రూపాయ‌ల నిధుల‌ను క్యుఐపి (QIP) ప‌ద్ధ‌తిలో విజ‌య‌వంతంగా స‌మీక‌రించింది.
 
ప్ర‌స్తుతం ఎస్‌బిఐ కాకుండా 20 ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు కూడా ప‌ని చేస్తున్నాయి.  బ్యాంకుల‌ జాతీయ‌క‌ర‌ణ జ‌రిగిన 1970/80 ద‌శ‌కాల నాటి నుండి చూస్తే బ్యాంకింగ్ ముఖ చిత్రం మార్పున‌కు లోనైంది.  ప్ర‌యివేట్ రంగ బ్యాంకులు, బ్యాంకింగేత‌ర ఆర్థిక కంపెనీలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు మ‌రియు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు తెర మీద‌కు వ‌చ్చాయి.  తాజా నిర్ణ‌యం వ‌ర్ధిల్లుతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ యొక్క ప‌ర‌ప‌తి అవ‌స‌రాల‌ను నెర‌వేర్చ‌డానికి ప్ర‌భుత్వ రంగంలో బ‌ల‌మైన మ‌రియు స్ప‌ర్దాత్మ‌క బ్యాంకులు అవ‌త‌రించ‌డానికి మార్గాన్ని సుగ‌మం చేయ‌డ‌మే కాకుండా ఏవైనా దెబ్బ‌లు త‌గిలితే వాటిని అధిగ‌మించ‌డంతో పాటు ప్ర‌భుత్వ ఖ‌జానా పై అత్య‌ధికంగా ఆధార‌ప‌డ‌కుండా వ‌న‌రులను స‌మీక‌రించ‌గ‌లిగే సామ‌ర్ధ్యాన్ని కూడా ఈ బ్యాంకుల‌కు అందించ‌గ‌ల‌దు.
 

***



(Release ID: 1500503) Visitor Counter : 97


Read this release in: English