PIB Headquarters
పిల్లల ఆధార్ నమోదుకై జనన దృవీకరణ పత్రం తప్పనిసరి
Posted On:
18 JUL 2017 6:45PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఆధార్ నమోదు ప్రక్రియ పూర్తి చేసేందుకు హైదరాబాద్ ప్రాంతీయ యుఐడిఎఐ కార్యాలయం కృషి చేస్తున్నదని, యుఐడిఎఐ ప్రాంతీయ కార్యాలయం డిప్యూటీ డైరక్టర్ జనరల్ శ్రీ ఎం.వి.ఎస్. రామిరెడ్డి తెలిపారు. ముఖ్యంగా 5 సంవత్సరాల లోపు వయస్సు గల బాలబాలికల ఆధార్ నమోదును వారి జనన దృవీకరణ పత్రం సులభతరం చేస్తుందని శ్రీ రెడ్డి పేర్కొన్నారు. యుఐడిఎఐ ప్రాంతీయ కార్యాలయం చేపట్టిన పైలెట్ నమోదు కార్యక్రమంలో 5 సంవత్సరాల లోపు బాలబాలికల్లో చాలా మందికి జనన దృవీకరణ పత్రం లేదని శ్రీ రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే యుఐడిఎఐ ప్రాంతీయ కార్యాలయం ప్రత్యేక ఆధార్ నమోదు కార్యక్రమాన్ని పిల్లల కోసం అంగన్ వాడీ కేంద్రాల ద్వారా చేపట్టనుందని శ్రీ రామిరెడ్డి వివరించారు.
***
(Release ID: 1496042)
Visitor Counter : 79