PIB Headquarters
బాపు అందించే ప్రేరణ పై జాతీయ లేఖా రచన పోటీ
Posted On:
18 JUL 2017 6:42PM by PIB Hyderabad
జాతీయ లేఖా రచన పోటీని నిర్వహిస్తున్నట్లు తపాలా విభాగం తెలిపింది. 2017 – 18 సంవత్సరానికి గాను తపాలా బిళ్ళల సంకలనాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలలో భాగంగా ఈ పోటీని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సర్కిల్ ముఖ్య పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయం ఒక ప్రకటనలో వివరించింది.“ప్రియమైన బాపు (మహాత్మ గాంధీ), మీరు నాకు ప్రేరణ నిస్తున్నారు’’ అనే అంశం ఈ పోటీకి ఇతివృత్తంగా ఉంటుంది. ఇంగ్లీషు/హిందీ/స్థానిక భాషలలోబాపు లేదా మహాత్మ గాంధీకి లేఖను రాసి, ఆ లేఖలో చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్, తెలంగాణ సర్కిల్, హైదరాబాద్ – 500 001 చిరునామాకు పంపవచ్చు. ఎ-4 సైజు తెల్లకాగితం పై ఈ లేఖను రాయాలి. ఇది 1000 పదాలకు మించకూడదు. లేదా ఇన్లాండు లెటర్ కార్డులపై 500 పదాలకు మించకుండా రాయవచ్చు. ఈ లేఖలను జిల్లా ముఖ్య పట్టణాలు మరియు పెద్ద పట్టణాలు/నగరాలలో తపాలా కార్యాలయాల వద్ద “లెటర్ రైటింగ్ క్యాంపైన్’’ కోసం అంటూ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన తపాలా పెట్టెలలో వేయాలి. గ్రామీణ ప్రాంతాలలో ఈ లేఖలను బ్రాంచ్ పోస్టాఫీసులలో పోస్టు చేయాలి. ఈ పోటీని అన్ని వయో వర్గాల వారికి ఉద్దేశించారు. 18 ఏళ్ళ లోపు వయస్సు వారు మరియు 18 ఏళ్ళకు మించిన వయస్సు కలిగిన వారి కోసం ఇన్లాండ్ లెటర్ కార్డు కేటగిరి మరియు ఎన్వెలప్ కేటగిగి అని రెండు కేటగిరీలో ఈ పోటీ ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రతి కేటగిరీలోను 3 ఉత్తమ ఎంట్రీలను ఎంపికచేసి సాబర్మతి ఆశ్రమానికి పంపిస్తారు. 2017 అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా సాబర్మతి ఆశ్రమంలో నిర్వహించే కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రతి కేటగిరీలోను 3 ఉత్తమ ఎంట్రీలను ఎంపికచేసి, గాంధీ జయంతి నాడు హైదరాబాద్ లో నిర్వహించే ఒక ఫిలాటెలీ ఎగ్జిబిషన్ లో అవార్డులను గాంధీ జయంతి నాడు ప్రదానం చేయనున్నట్లు అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ జనరల్ (ఎఫ్ఎస్, ఫిలాటెలీ అండ్ టెక్నికల్) ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2017ఆగస్టు 15వ తేదీ తరువాత పోస్టు చేసే ఉత్తరాలను స్వీకరించబోరు. 18 ఏళ్ళ లోపు వయస్సు, 18 ఏళ్ళకు మించిన వయస్సు కలిగిన కేటగిరీలు రెండింటిలోను ప్రదానం చేసే బహుమతుల వివరాలు ఈ కింది విధంగా ఉంటాయి.
వరుస సంఖ్య
|
బహుమతులు
|
అఖిల భారత స్థాయి (నగదు బహుమతి, గౌరవ బిరుదు)
|
రాష్ట్ర స్థాయి నగదు బహుమతి
|
1
|
ప్రతి కేటగిరీలోను ప్రథమ బహుమతి
|
రూ. 50,000 (ప్యాట్రన్ ఆఫ్ పోస్ట్ స్)
|
రూ. 25,000/-
|
2
|
ప్రతి కేటగిరీలోను ద్వితీయ బహుమతి
|
రూ. 25,000/- (కంపానియన్ ఆఫ్ పోస్ట్ స్)
|
రూ. 10,000/-
|
3
|
ప్రతి కేటగిరీలోను తృతీయ బహుమతి
|
రూ. 10,000/- (పోస్ట్ పాల్)
|
రూ. 5,000/-
|
ప్రతి కేటగిరీలో ఉత్తమైన 10 ఎంట్రీలను గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర రాజధానిలో ఏర్పాటుచేసే స్పెషల్ ఫిలాటెలీ ఎగ్జిబిషన్ లో ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శనలో ఆయా ఎంట్రీలకు బహుమతులు అందజేస్తారు. ఉత్తమ లేఖలలోని విషయానికి విస్తృమైన ప్రచారం లభిస్తుంది. అలాగే రచయితలకు బహుమతులు అందజేయబడంతోపాటు, తగిన గుర్తింపు ఇవ్వబడుతుందని అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ జనరల్ (ఎఫ్ఎస్, ఫిలటెలీ), చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయం, తెలంగాణ సర్కిల్, హైదరాబాద్ వారు ఒక ప్రకటన తెలియజేశారు.
***
(Release ID: 1496040)