PIB Headquarters
జిఎస్ టి & కస్టమ్స్ హైదరాబాద్ జోన్ చీఫ్ కమిషనర్ గా శ్రీ బి.బి. అగర్వాల్
Posted On:
13 JUL 2017 6:50PM by PIB Hyderabad
హైదరాబాద్ జోన్ (తెలంగాణ రాష్ట్రం) జిఎస్ టి & కస్టమ్స్ చీఫ్ కమిషనర్ గా శ్రీ బన్కే బెహరి అగర్వాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అలాగే, శ్రీ అగర్వాల్ జిఎస్ టి & కస్టమ్స్ విశాఖపట్నం జోన్ (ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం) చీఫ్ కమిషనర్ (ఇన్ ఛార్జి) గా కూడా వ్యవహరిస్తారు.
1985 బ్యాచ్, ఇండియన్ రెవిన్యూ సర్వీస్ కు చెందిన శ్రీ అగర్వాల్ ఇంతకు ముందు వివిధ ప్రాంతాల్లో పని చేశారు. అలాగే, జిఎస్ టి చట్టాలలో అప్పీళ్ళు, సమీక్షలకు సంబంధించిన అంశాలపై పని చేశారు. అలాగే, 2016 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 60 వేల మంది అధికారులకు జిఎస్ టి 4 అంచెల శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. తన విభాగం తరపున టాక్స్ చెల్లింపుదారులకు ఉన్న సమస్యలను పరిష్కరించడంలో ముందుంటానని శ్రీ అగర్వాల్ పేర్కొన్నారు. శ్రీ అగర్వాల్ చిరునామా ccehyd@excise.nic.in
***
(Release ID: 1495548)
Visitor Counter : 142