PIB Headquarters
సభ్యులు కాని వారిచే డిపాజిట్లను అంగీకరిస్తున్న సహకార సంఘాల పట్ల జాగ్రత్త వహించగలరు: ఆర్ బిఐ
Posted On:
23 JUN 2017 6:32PM by PIB Hyderabad
సహకార సంఘాలు మరియు ప్రాథమిక సహకార రుణ సంఘాలు, సభ్యులు కాని వారిచే / నామమాత్రపు సభ్యులచే / అనుబంధ సభ్యులచే డిపాజిట్లు అంగీకరించారు అనేది రిజర్వు బ్యాంకు దృష్టిలోకి వచ్చింది. ఈ సహకార సంస్థలకు, బ్యాంకింగ్ వ్యాపారము చేయుటకు, రిజర్వు బ్యాంకు బి.ఆర్. యాక్ట్ ను అనుసరించి ఎటువంటి లైసెన్స్ జారీ చేయలేదు. సరికదా, అధికారం కూడా ఇవ్వలేదు అని ప్రజా సభ్యులకు మనవి చేయడమైంది. పైన పేర్కొన్న ప్రజలకు సంఘాలలో ఉంచిన డిపాజిట్లకు డిఐసిజిసి నుండి ఎటువంటి బీమా కవరేజ్ లేదు. ఈ సంఘాలతో సంప్రదింపులు జరిపే సభ్యులు జాగరూకతతో వ్యవహరించవలసిందిగా హెచ్చరించడమైందని రిజర్వు బ్యాంకు రీజనల్ డైరెక్టర్ శ్రీ ఆర్. సుబ్రమణియన్ తెలియజేశారు.
***
(Release ID: 1493728)