PIB Headquarters

కవాడిగూడ సి.జి.ఒ టవర్స్ ప్రాంగణంలో ఘనంగా 3వ అంతర్జాతీయ యోగా దినోత్సవం

Posted On: 21 JUN 2017 6:24PM by PIB Hyderabad
Press Release photo

హైదరాబాద్ కవాడిగూడా లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో బుధవారం 3వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మొత్తం 19 విభాగాలకు చెందిన 150కు పైగా అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు “ఇశా ఫౌండేషన్’’ నుండి వచ్చిన యోగా నిపుణుల సహాయంతో యోగాసనాలు వేశారు. పెట్రోలియం, ఎక్స్ ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ ప్లోజివ్స్ డాక్టర్ ఆర్. వేణుగోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ వేణుగోపాల్ మాట్లాడుతూ, ఆరోగ్యాన్ని కాపడుకోవడానికి యోగాను అవలంభించడం ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పెట్రోలియమ్ సంస్థలకు చెందిన అధికారులు కూడా పాల్గొన్నారు.

 

***


(Release ID: 1493486)
Read this release in: English