ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి నేడు లఖ్ నవూ కు వెళ్లనున్నారు; రేపు యోగ దినం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు

Posted On: 20 JUN 2017 8:20PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లఖ్ నవూ కు వెళ్తున్నారు; అక్కడ ఆయన రేపు యోగ దినం సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమం తో పాటు వివిధ కార్యక్రమాలలో పాలుపంచుకోనున్నారు. 

ఈ రోజు సాయంత్రం పూట, ప్రధాన మంత్రి సిఎస్ఐఆర్- సెంట్రల్ డ్రగ్ రిసర్చ్ ఇన్ స్టిట్యూట్ (సిఎస్ఐఆర్-సిడిఆర్ఐ) ను సందర్శిస్తారు. 

ప్రధాన మంత్రి డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ టెక్నికల్ యూనివర్సిటీ కి చెందిన ఒక భవనాన్ని ప్రారంభిస్తారు కూడా. లఖ్ నవూ లో ప్రధాన మంత్రి 400 కె వి లఖ్ నవూ-కాన్ పుర్ డి/సి ట్రాన్స్ మిషన్ లైనును దేశ ప్రజలకు అంకితమిస్తారు. 

ప్రధాన మంత్రి ‘పిఎమ్ ఆవాస్ యోజన’ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను కూడా పంపిణీ చేయనున్నారు. 

రేపు ఉదయం, మూడవ యోగ దినం నాడు, ప్రధాన మంత్రి లఖ్ నవూ లోని రమాబాయి అంబేడ్కర్ మైదానంలో యోగ దిన కార్యక్రమంలో పాల్గొననున్నారు. 

మీరు మీ మొబైల్ ఫోన్ లలో http://nm4.in/dnldapp ద్వారా లఖ్ నవూ లో ప్రధాన మంత్రి పాల్గొనే కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించవచ్చు. 


(Release ID: 1493403) Visitor Counter : 68
Read this release in: English