PIB Headquarters

అవ్యవస్థీకృత రంగ శ్రామికులకు ఆరోగ్య, గృహ నిర్మాణ పథకాలను అమలుచేస్తున్నాం: లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్

- ‘గత మూడు సంవత్సరాలలో 3,48,699 మందికి
రూ.30,37,53,470 విలువైన స్కాలర్ షిప్ లు అందించాం’
- ‘‘2017 జూన్ 1న హైదరాబాద్ లో ప్రత్యేక కార్యక్రమ నిర్వహణ’’

Posted On: 29 MAY 2017 7:27PM by PIB Hyderabad

బీడి తయారీ/ చలనచిత్రాలు/ లైమ్ స్టోన్ & డోలమైట్ మరియుు ఇనుప ఖనిజం/ మాంగనీస్ ఖనిజం, క్రోమ్ ఖనిజం ఇంకా మైకా గనుల వంటి అవ్యవస్థీకృత రంగ శ్రామికులకు ఆరోగ్యగృహ నిర్మాణ, ఉపకార వేతన పథకాలను అమలు చేస్తున్నట్లు హైదరాబాద్ లోని లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కు చెందిన వెల్ఫేర్ కమిషనర్ తెలిపారు.  లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ లో భాగంగా ఉంది. గత సంవత్సరాలలోను మొత్తం 3,48,699 మంది లబ్దిదారులకు రూ. 30,37,53,470 విలువైన ఉపకార వేతనాలను అందజేసినట్లు వెల్ఫేర్ కమిషనర్ వివరించారు. 2014-15లో 1,01,176 మందికి రూ.8,51,67,110, 2015-16లో 1,59,396 మందికి 13,17,69,6102016-17లో 88,127 మందికి రూ.8,68,16,750 మేరకు స్కాలర్ షిప్ ల రూపంలో సహాయం అందించినట్లు పేర్కొన్నారు. ‘‘సవరించిన సమగ్ర గృహ నిర్మాణ పథకం-2016’’ లో భాగంగా 550 దరఖాస్తులు అందాయనివాటిని పరిశీలిస్తున్నామని వివరించారు.  కేంద్రంలో ఎన్ డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో తమ సంస్థ ప్రధాన విజయాలను వివరించేందుకు 2017 జూన్ 1న హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్ఫేర్ కమిషనర్ పేర్కొన్నారు. అన్ని కేటగిరీలకు చెందిన వర్కర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని దీనిని విజయవంతం చేయాలని ఒక ప్రకటనలో కోరారు. 

                                    ***



(Release ID: 1491254) Visitor Counter : 102


Read this release in: English