PIB Headquarters
2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ. 5282.36 కోట్ల విలువైన పి.ఎఫ్. చందాలు అందుకున్నాం: శ్రీ బి. చంద్రశేఖర్, ప్రాంతీయ పిఎఫ్ కమిషనర్, ఇపిఎఫ్ఒ తెలంగాణ రాష్ట్ర జోనల్ కార్యాలయం
- 98 శాతం క్లెయిమ్ లను 20 రోజుల్లో పరిష్కరించాం
- రూ. 42.82 కోట్ల విలువైన పింఛన్ సొమ్మును 2017 ఏప్రిల్ లో చెల్లించాం
Posted On:
26 MAY 2017 6:56PM by PIB Hyderabad
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్ఒ) తెలంగాణ జోనల్ కార్యాలయం 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ. 5282.36 కోట్ల విలువైన పి.ఎఫ్. చందాలను అందుకుందని తెలంగాణ రాష్ట్ర ఇపిఎఫ్ఒ ప్రాంతీయ భవిష్య నిధి కమిషనర్ శ్రీ బి. చంద్రశేఖర్ తెలిపారు. ఆయన ఈ రోజు హైదరాబాద్ లో ప్రసార మాధ్యమాల ప్రతినిధులతో మాట్లాడారు. మొత్తం 3 పథకాల్లోను చేసిన చెల్లింపులు రూ. 3355.34 కోట్లుగా ఉన్నాయన్నారు. నెలకు సగటున 85 వేల క్లెయిమ్ లు వచ్చాయని, వాటిలో 98 శాతం క్లెయిమ్ లను 20 రోజుల లోగా పరిష్కరించామని వివరించారు. ఇతర వివరాలను గురించి వెల్లడిస్తూ, తమ కార్యాలయం పరిధిలో 3,11,923 మంది పింఛన్ దారులు ఉన్నారని తెలిపారు. 2017 ఏప్రిల్ లో రూ. 42.82 కోట్ల పెన్షన్ సొమ్మును చెల్లించామని చెప్పారు. నెలకు 2100 ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయని, వాటిలో 88 శాతం ఫిర్యాదులను వారం రోజుల లోపల పరిష్కరించామని వెల్లడించారు. పింఛన్ దారులలో 57 శాతం మంది ఆన్ లైన్ లో లైఫ్ సర్టిఫికెట్లు (జీవన్ ప్రమాణ్ పత్రాలు ) దాఖలు చేశారన్నారు. 2017 జనవరి 1వ తేదీ నుంచి కొనసాగుతున్న ఎంప్లాయీస్ ఎన్ రోల్ మెంట్ క్యాంపెయిన్ లో భాగంగా 406049 మంది కొత్త ఉద్యోగులను చేర్చుకున్నట్లు చెప్పారు. తెలంగాణ జోన్ పరిధిలో 37,919 సంస్థలు ఉన్నాయని, పిఎఫ్ చందాదారుల సంఖ్య 84.97 లక్షలుగా ఉన్నదని శ్రీ బి. చంద్రశేఖర్ తెలిపారు.
***
(Release ID: 1490968)
Visitor Counter : 67