PIB Backgrounder

బిపిఎల్ కుటుంబాలకు ఉచితంగా ఎల్ పిజి కనెక్షన్ లు ఇస్తున్నారు నకిలీ వెబ్ సైట్ ల వర్తమానాలకు స్పందించవద్దని ప్రజలకు సలహా

నాడు పోస్టు చేయడమైనది: 23 MAY 2017 6:51PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన (పిఎమ్ యువై) కి సంబంధించినవంటూ అనేక నకిలీ వెబ్ సైట్ లు ఇటీవల పుట్టుకువచ్చిన విషయం పెట్రోలియమ్ మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చింది. ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన (పిఎమ్ యువై) కి సంబంధించిన ఆధికారిక వెబ్ సైట్ www.pmujjwalayojana.com అని సాధారణ ప్రజానీకానికి తెలియజేయడమవుతున్నది.  కొత్త ఎల్ పిజి కనెక్షన్ లను కోరుకొంటున్న లబ్ధిదారులు పూర్తి చేసి ఇవ్వవలసిన ఫారాలను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకొనే విధంగా ఆధికారిక వెబ్ సైట్ లో అందుబాటులోకి తీసుకురావడమైంది.   ఎల్ పిజి కనెక్షన్ లను బిపిఎల్ కుటుంబాలకు ఉచితంగా ఇస్తున్నారు.  అయితే, www.ujwalayojana.org పేరుతో ఒక ఎన్ టిటీ ఆర్ జిజిఎల్ వి యోజన లో భాగంగా ఎల్ పిజి డిస్ట్రిబ్యూటర్ షిప్ నియామకానికి సంబంధించిన ఒక ప్రకటనను ప్రసార మాధ్యమాలలో జారీ చేసినట్లు గమనించడం జరిగింది.  ఈ ఎన్ టిటీ కి ఎల్ పిజి డిస్ట్రిబ్యూటర్ షిప్ ను నియమించేందుకు మంత్రిత్వ శాఖ ఎటువంటి అధికారాన్ని ఇవ్వలేదు. ఈ ఎన్ టిటీ ప్రకటనకు గాని, లేదా అధికారం లేనటువంటి వెబ్ సైట్ లు/వ్యక్తుల వవ్ద నుండి అందే ఇదే తరహా లోని ఇతర వర్తమానాలకు గాని ప్రతిస్పందించవద్దంటూ సాధారణ ప్రజలకు విజ్ఞ‌ప్తి చేయడమవుతోంది. ఎల్ పిజి ఏజెన్సీల డిస్ట్రిబ్యూషన్ ను ఈ పథకంలో భాగంగా ఆమోదించడం జరగట్లేదని స్పష్టం చేయడమైంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించవలసిందిగా కోరడమైంది.

*** 


(రిలీజ్ ఐడి: 1490549) సందర్శకుల సూచీ సంఖ్య : : 88
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English