మంత్రిమండలి
బాంగ్లాదేశ్ లోని ఢాకాలో ఉన్న నేషనల్ డిఫెన్స్ కాలేజీకి మరియు న్యూ ఢిల్లీ లోని నేషనల్ డిఫెన్స్ కాలేజీకి మధ్య ఫ్యాకల్టీ ఎక్ఛేంజ్ అగ్రిమెంటుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
నాడు పోస్టు చేయడమైనది:
17 MAY 2017 7:41PM by PIB Hyderabad
బాంగ్లాదేశ్ లోని ఢాకాలో ఉన్న నేషనల్ డిఫెన్స్ కాలేజీకి మరియు న్యూ ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీకి మధ్య ఫ్యాకల్టీ ఎక్ఛేంజ్ అగ్రిమెంట్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.
జాతీయ భద్రత అభివృద్ధి మరియు వ్యూహాత్మక అధ్యయనాల రంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందించాలన్న ధ్యేయంతో రెండు నేషనల్ డిఫెన్స్ కాలేజీల మధ్య క్రమం తప్పని రీతిలో ఆదాన ప్రదాన కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు, స్థిర ప్రాతిపదికన పనిచేసే యంత్రాంగాలను ఏర్పాటుచేయడం ఒప్పందం ధ్యేయం.
రెండు దేశాల మధ్య ఉన్నటువంటి భౌగోళిక, సాంస్కృతిక సాన్నిహిత్వాన్ని దృష్టిలో పెట్టుకొంటే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం వంటి అనేక సవాళ్ళు కూడా ఉన్నాయి. ఈ సవాళ్ళ విషయంలో సంయుక్త కార్యాచరణను చేపట్టవలసిన అవసరం ఉంది. ఈ కారణంగా సాయుధ బలగాల మధ్య చక్కని సమన్వయం, సహకారం నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్య సంస్థల ఫ్యాకల్టీ మెంబర్ల ఆదాన ప్రదానం, సాయుధ బలగాల శక్తియుక్తులలో సమానత్వాన్ని సాధించడంలో సహాయపడగలదు. అంతేగాక, ఉమ్మడి ముప్పులను, సవాళ్ళను మరింత మెరుగ్గా ఎదుర్కోవడానికి కూడా ఉపయోగపడగలదు.
వ్యూహాత్మకమైన మరియు విన్యాసాలకు సంబంధించిన, అధ్యయనాలతో కూడిన సైనిక విద్య రంగంలో హితోధిక సహకారానికి ఒక ఫ్రేమ్ వర్క్ ను ఈ ఒప్పందం ఏర్పరచగలుగుతుంది.
(రిలీజ్ ఐడి: 1490096)
సందర్శకుల సూచీ సంఖ్య : : 19