PIB Headquarters
వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో
2016కు సంబంధించి మల్టి- టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ పోస్టుకు
30.04.2017, 14.05.2017, 28.05.2017 మరియు 04.06.2017 తేదీలలో నియామక పరీక్ష : స్టాఫ్ సెలక్షన్ కమిషన్
నాడు పోస్టు చేయడమైనది:
25 APR 2017 6:42PM by PIB Hyderabad
వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 2016కు సంబంధించి మల్టి-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ పోస్టుకు 30.04.2017, 14.05.2017, 28.05.2017 మరియు 04.06.2017 తేదీలలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నియామక పరీక్షను నిర్వహించనుంది. దక్షిణ ప్రాంతంలో ఈ నియామక పరీక్ష 14 కేంద్రాలలో మార్నింగ్ సెషన్ లో ఉదయం 10 గంటల నుంచి మిట్టమధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సదరన్ రీజియన్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్. రాజలక్ష్మి తెలిపారు. ఈ పరీక్ష తెలంగాణాలోని హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ లలోను, ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్టణం లలోను, తమిళ నాడులోని చెన్నై, కోయంబత్తూరు, మదురై, తిరుచురాపల్లి, తిరునెల్వేలి లలోను, కేంద్ర ప్రాంతమైన పాండిచ్చేరి లోని పాండిచ్చేరిలోను ఉంటుంది. 30.04.2017 మరియు 14.05.2017 లలో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఇప్పటికే ఇ-అడ్మిట్ కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తన వెబ్ సైట్ ( www.sscsr.gov.in) లో సదరన్ రీజినల్ ఆఫీస్ పోస్ట్ చేసింది. ఈ వివరాలను గురించిన సమాచారాన్ని అభ్యర్థులు ఇచ్చిన ఫోన్ నంబర్ లకు ఎస్ఎమ్ఎస్ ద్వారా, మెయిల్ ఐడి లకు ఇ-మెయిల్ ద్వారా కూడా తెలిపారు. 28.05.2017 మరియు 04.06.2017తేదీలలో పరీక్ష రాయవలసి ఉన్న అభ్యర్థులకు ఇ-అడ్మిట్ కార్డులను క్రమానుగతంగా 08.05.2017 తేదీ మరియు 15.05.2017 తేదీలో వెబ్ సైట్ లో పోస్ట్ చేస్తారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సదరన్ రీజినల్ ఆఫీస్ హెల్ప్ లైన్ నెంబర్లు అయినటువంటి ల్యాండ్ లైన్ నంబర్ 044-28251139 ను, ఇంకా మొబైల్ నంబర్ 9445195946 ను సంప్రతించవచ్చు.
***
(రిలీజ్ ఐడి: 1488613)
సందర్శకుల సూచీ సంఖ్య : : 138
బ్యాగ్రౌండ్ రిలీజ్ రిఫరెన్స్
Staff Selection Commission
ఈ లింక్ మిమ్మల్ని ఈ వెబ్ సైట్ ఇంటరాక్టివ్ పేజ్ వెలుపలికి తీసుకువెళ్తుంది. కొనసాగడం కోసం ఓకె ను క్లిక్ చేయండి. ఆపివేయడానికి క్యాన్సిల్ ను క్లిక్ చేయండి :
Staff Selection Commission