PIB Headquarters

మహిళలు వారి హక్కులను గురించి తెలుసుకోవడం తక్షణావసరం: హైదరాబాద్ ప్రెస్ ఇన్ ఫర్మేషన్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ పి.జె. సుధాకర్

-‘‘స్త్రీల హక్కులకు ప్రధానంగా కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్’’
-‘మహిళల హక్కులను కాపాడడంలో ప్రసార మాధ్యమాల పాత్ర కీలకం’
-“మానవ హక్కులన్నీ మహిళల హక్కులే”

నాడు పోస్టు చేయడమైనది: 08 MAR 2017 7:10PM by PIB Hyderabad
Press Release photo

 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కవాడిగూడ లో అభినందన కార్యక్రమం

 

     మానవ హక్కులన్నీ మహిళల హక్కులే అనే విషయాన్ని  ముఖ్యంగా మహిళలకు తెలియాలివారు ఈ సంగతిని తెలుసుకోవాలి అని హైదరాబాద్ ప్రెస్ ఇన్ ఫర్మేషన్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ పి.జె. సుధాకర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు హైదరాబాద్ లోని కవాడిగూడ లోని సి.జి.ఒ. టవర్స్ లో ప్రెస్ ఇన్ ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో ఏర్పాటైన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘స్త్రీల హక్కుల కోసం ప్రధానంగా కృషిచేసిన మహనీయుడు డాక్టర్ భీంరావు అంబేడ్కర్. మహిళల హక్కులను కాపాడడంలో ప్రసార మాధ్యమాలు పోషిస్తున్న పాత్ర కీలకం. మహిళల సాధికారతకు  ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ చట్టాలుపథకాలువిధానాల గురించిన సమాచారం మహిళలకు చేరడానికి ఎంతో ప్రాధాన్యం ఉంద’ని డాక్టర్ సుధాకర్ చెప్పారు. సమాచారం లేనందువల్ల సమస్యలు తీరవని పేర్కొన్నారు. ఆయన వివిధ చట్టాలను గురించి సంక్షిప్తంగా సభికులకు వివరించారు. నేడు మహిళలకు దక్కిన పలు హక్కులు రాజ్యాంగ శిల్పి డాక్టర్ అంబేడ్కర్ కఠోర పరిశ్రమ కారణంగా మన రాజ్యాంగంలో చోటు చేసుకోగలిగాయని తెలిపారు. చదువుకొనే హక్కుసమానత్వ హక్కువివక్షను అరికట్టే హక్కుజీవించే హక్కుస్వేచ్ఛ హక్కు ల వంటి పలు హక్కులను డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగంలో ఉల్లేఖించారని తెలిపారు. స్త్రీలను బానిస సంకెళ్ల నుంచి విడుదల చేయడం కోసం హిందూ కోడ్ బిల్లును డాక్టర్ అంబేడ్కర్ బిల్లును తెచ్చారని డాక్టర్ సుధాకర్ సభికులకు గుర్తు చేశారు. డాక్టర్ అంబేడ్కర్ త్యాగ నిరతి మహిళలకు వారికి దఖలు పడవలసిన హక్కులను వారికి దక్కించాయని వివరించారు. ఈశ్వర చంద్ర విద్యాసాగర్రాజా రామ మోహన్ రాయ్టంగుటూరి ప్రకాశం పంతులు వంటి సంఘ సంస్కర్తలు చేసిన కృషిని ఒకసారి స్ఫురణకు తీసుకువచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం మహిళా సంక్షేమంపై దృష్టి సారించి బేటీ బచావో- బేటీ పఢావో’, ‘కిశోర్ బాలిక’ స్కీమ్, ‘సుకన్య సమృద్ధి యోజన’ వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. పలు చట్టాలు ఉన్నప్పటికీ వాటి పక్కా అమలుకు పోలీసు విభాగంరెవెన్యూ విభాగంప్రభుత్వేతర సంస్థలు సహకారాన్ని అందించవలసి ఉందని డాక్టర్ సుధాకర్ అన్నారు. మహిళాలోకంలో నిశ్శబ్ద వేదనలకు అంతేలేదనిబయటి ప్రపంచం దాకా వినవస్తున్న వాణి చాలా తక్కువ స్వరంలో ఉంటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో చాలా దేశాలలో పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు ఆలస్యంగా లభించిందనిభారతదేశంలో మాత్రం స్వాతంత్ర్యం సిద్ధించిన అనతి కాలానికే మహిళలు సగౌరవంగా ఓటు హక్కును వినియోగించగలిగారనిదీనికి ప్రధాన కారకుడు డాక్టర్ అంబేడ్కర్ అని డాక్టర్ సుధాకర్ అన్నారు. అంబేడ్కర్ మరణానంతరం ఆయన ప్రతిపాదననలోని పలు అంశాలను క్రోడీకరించి 5 చట్టాలుగా తెచ్చారన్నారు. ప్రత్యేక వివాహాల చట్టంహిందూ వివాహ చట్టం,చ హిందూ వారసత్వ చట్టం ఈ అయిదు చట్టాలలో ఉన్నాయన్నారు. మహిళా దినోత్సవం నాడు దుర్గాబాయ్ దేశ్ ముఖ్చాంద్ బీబీసుల్తానా రజియారాణి రుద్రమజిజియా బాయిసరోజిని దేవిఇందిరా గాంధిప్రతిభా పాటిల్సుమిత్ర మహాజన్జయలలితమమతా బెనర్జీసుష్మా స్వరాజ్.. ఇలా ఎంతో మంది స్ఫూర్తిమూర్తులను తలచుకోవచ్చన్నారు. తల్లి రుణం తీర్చుకోలేనిది అని తెలిపారు.  

   సభలో ఇతర వక్తలు మాట్లాడుతూతమ తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. సిపిడబ్ల్యుడి ఎ.ఇ. శ్రీ శ్రీనివాస రావు మాట్లాడుతూతన చిన్నప్పుడు చదువు మానిపించేద్దామని తన తండ్రి చూశారనికానీ తల్లి మూడు రోజులు భోజనం ముట్టకుండా ఉండితాను బడికి వెళ్లేటట్లు చూశారన్నారు. పాలిటెక్నిక్ పరీక్షఫీజు కట్టే పరిస్థితి లేనప్పుడు తాళిని అమ్మి తనను చదివించిఈ రోజు ఇంత ఉన్నత పదవిలో ఉండేందుకు కారణమయ్యారని వెల్లడించడం పలువురిని కదలించివేసింది. మహిళలకు న్యాయం చేసేందుకు ఎన్ని చట్టాలు ఉన్నావారి పట్ల పురుషుల ఆలోచనసరళిలో మార్పు రావడం ప్రధానమని మహిళా అధికారి శ్రీమతి కరుణ అన్నారు. ఉద్యోగం చేసే మహిళకు ఆర్థిక స్వాతంత్ర్యం ఉంటుందనిఅదే ఇంటి వద్దే ఉండే మహిళకు ఆ స్వేచ్ఛ ఉండదనిఅయితే గృహిణులు పురుషుల కన్నా ఇంటినిపిల్లలను చక్కదిద్దగల సామర్థ్యం కలిగి వుంటారని హోం మంత్రిత్వ శాఖకు చెందిన మహిళా అధికారి కౌసల్య స్పష్టంచేశారు. మహిళా సాధికారత ద్వారానే దేశం అభివృద్ధి పథంలో సాగుతుందని డిజిఎమ్ ఎస్ డైరెక్టర్ విజయ్ కుమార్ అన్నారు. పలువురు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

***


(రిలీజ్ ఐడి: 1483879) సందర్శకుల సూచీ సంఖ్య : : 542
ఈ లింక్ మిమ్మల్ని ఈ వెబ్ సైట్ ఇంటరాక్టివ్ పేజ్ వెలుపలికి తీసుకువెళ్తుంది. కొనసాగడం కోసం ఓకె ను క్లిక్ చేయండి. ఆపివేయడానికి క్యాన్సిల్ ను క్లిక్ చేయండి :   international womens day
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English