Print
XClose
Press Information Bureau
Government of India
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
11 MAR 2021 11:02AM by PIB Hyderabad
'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసిన సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ

75 వసంతాల స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించడం ఒక పెద్ద ఉత్సవం అని ప్రధానమంత్రి అన్నారు. స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి, ప్రాణార్పణ చేసిన వీరులు, వారి చేసిన ప్రతిజ్ఞ గుర్తు చేసుకునే సమయమిది అని తెలిపారు. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ సందర్బంగా జరిగిన జాతీయ కమిటీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. సనాతన భారత వైశిష్ట్యం, సంప్రదాయాలను ఈ ఉత్సవాలు ప్రతిబింబించాలని, అలాగే ప్రజ్వలమైన  ఆధునిక భారత వైభవాన్ని చాటాలని ఆయన హితవు పలికారు. ఋషుల ఆధ్యాత్మిక చైతన్యాన్ని, శాస్త్రవేత్తల నైపుణ్య పాటవాల స్ఫూర్తిని ప్రతిబింబించాలని ప్రధాని సూచించారు. అంతే కాదు ఈ ఉత్సవాల ద్వారా గడచిన 75 ఏళ్లలో మన దేశం సాధించిన విజయాలు చెబుతూనే, వచ్చే 25 ఏళ్ల దార్శనిక చట్రానికి కూడా రూపురేఖలు ఇవ్వాలని తీర్మానం చేయాలని ప్రధాన మంత్రి అభిలషించారు. 

ఈ 75 ఏళ్ల ఉత్సవాలకు మూలస్థంభాలను కూడా ప్రధాని వెల్లడించారు: 

1. స్వాతంత్ర్య పోరాటం 

2. 75 ఏళ్ల లో ఆలోచన విధానాలు 

3. 75 ఏళ్ల లో విజయాలు 

4. 75 ఏళ్లలో చేపట్టిన చర్యలు 

5. 75 వద్ద తీర్మానం 

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ స్వాతంత్య్ర దినోత్సవం-2022 కు 75 వారాల ముందు ప్రారంభమవుతుంది. 2023 స్వాతంత్ర్య దినోత్సవం వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమం 25 రోజుల వేడుకలతో ప్రారంభమవుతుంది, ఇది మార్చి 12, 2021 (దండి మార్చి ప్రారంభించిన వార్షికోత్సవం) గుజరాత్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రారంభోత్సవం మరియు 2021 ఏప్రిల్ 5 న (దండి యాత్ర ముగింపు)తో ముగుస్తుంది .ప్రధాని దార్శనికతకు అనుగుణంగా, ఉత్సవం శోభాయమానంగా జరిగేలా సమాచార, ప్రసారాల ( ఐ అండ్ బి ) మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న కార్యక్రమాల కవరేజ్ కోసం విస్తృతంగా ప్రణాళికలు రూపొందించింది.   

  1. గుజరాత్‌లో ప్రారంభ కార్యక్రమాలకు దూరదర్శన్ న్యూస్, వార్త సేవా విభాగం ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. తదనంతరం, ప్రాంతీయ వార్తా విభాగాలు దేశవ్యాప్తంగా రాష్ట్ర స్థాయిలో నిర్వహించే కార్యక్రమాలను ప్రసారం చేస్తాయి. అమృత్ మహోత్సవ్‌పై ప్రైమ్‌టైమ్ చర్చలు, ప్రత్యేక కార్యక్రమాలు ఇరు సంస్థలచే నిర్వహిస్తారు. ప్రారంభోత్సవ కార్యక్రమాల తర్వాత జాతీయ రౌండ్-అప్ ఇవ్వడం జరుగుతుంది.

 

  1. బ్యూరో ఆఫ్ అవుట్ రీచ్ కమ్యూనికేషన్ విభాగం రాష్ట్ర / యుటి ప్రభుత్వాల భాగస్వామ్యంతో 75 సంవత్సరాల స్వాతంత్ర్యం అనే అంశంపై దేశవ్యాప్తంగా ప్రదర్శనలను నిర్వహిస్తుంది. ప్రధాన కార్యక్రమాన్ని గాంధీనగర్‌లోని సబర్‌మతి ఆశ్రమంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. తదనంతరం, మొత్తం ముప్పై ఏడు రాష్ట్రస్థాయి ప్రదర్శనలను మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రముఖ వ్యక్తులు ప్రారంభిస్తారు. ఈ ప్రదర్శనలలో దండి మార్చి, మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్ మరియు ఉద్యమ నాయకులు మన దేశం కోసం చేసిన త్యాగాలు తెలియజేసే కార్యక్రమాలు ఉంటాయి. వీటిలో ప్రధానంగా సహాయ నిరాకారణ, శాసనోల్లంఘన, క్విట్ ఇండియా వంటి ఉద్యమాల గురించి ప్రదర్శనలు ఉంటాయి.  

కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్ ముప్పై ఏడు ప్రదేశాలకు గాను ఆరు ప్రదేశాల్లో వర్చ్యువల్ గా ప్రదర్శనలను 2021 మార్చి 13 న ప్రారంభిస్తారు.

  1. సాంబ జిల్లా, జమ్ము కశ్మీర్ 
  2. బెంగుళూరు, కర్ణాటక 
  3. పూణే, మహారాష్ట్ర 
  4. భువనేశ్వర్, ఒడిశా 
  5. మొయిరాంగ్ జిల్లా, బిష్ణుపూర్, మణిపూర్ 
  6. పాట్నా, బీహార్ 

శ్రీ ప్రకాష్ జవదేకర్ 2021 మార్చి 13 న న్యూ ఢిల్లీ లోని నేషనల్ మీడియా సెంటర్‌లో ప్రదర్శనను ప్రారంభిస్తారు.

ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఈ కార్యక్రమాలపై అన్ని రాష్ట్రాలు చాలా ఆసక్తి చూపుతూ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ముందుకు వచ్చాయని అన్నారు. దండి మార్చి వార్షికోత్సవం సందర్భంగా మార్చి 12 నుండి ప్రారంభమై దాదాపు రెండున్నర సంవత్సరాలు కొనసాగుతున్న ఈ కార్యక్రమాలు దేశంలో ఉత్సవ వాతావరణాన్ని కలిగిస్తున్నాయని ఆయన అన్నారు.

 

  1. స్వాతంత్య్ర ఉద్యమంలో వెలుగు చూడని వీరుల గాధలు, మహిళా స్వాతంత్ర్య సమరయోధులు, ఈశాన్య భారతదేశం జరిగిన పోరాటాలు, ఆ స్వాతంత్ర్య సమరయోధులు, ఎర్రకోటలోని భారత జాతీయ ఆర్మీ రైలు, స్వాతంత్ర్య ఉద్యమంలో పత్రికా పాత్ర, తదితరులపై పుస్తకాలను ప్రచురణ విభాగం ప్రచురిస్తుంది. రెండేళ్ల వ్యవధిలో ప్రచురణలు అందుబాటులోకి వస్తాయి.

 

***