Print
XClose
Press Information Bureau
Government of India
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
20 OCT 2020 12:36PM by PIB Hyderabad
ఇండియాలో స్ప‌ష్టంగా క‌నిపిస్తున్న జాతీయ నులిపురుగుల నిర్మూల‌న దినోత్స‌వ ప్ర‌భావం

పిల్ల‌ల‌లో నులిపురుగుల స‌మ‌స్య ప్రజారోగ్య స‌మ‌స్య‌గా ఉంటున్న‌ది. సాయిల్ ట్రాన్స్‌మిటెడ్ హెల్‌మిన్‌థియాసిస్ _ఎస్‌టిహెచ్ ఇది పేగుల్లో ఇన్‌ఫెక్ష‌న్ గురిచేసే నులిపురుగుల స‌మ‌స్య‌.ఇది పిల్ల‌ల ఎదుగుద‌ల పైన వారి ఆరోగ్యంపైన ప్ర‌భావం చూపుతుంది. దీనివ‌ల్ల పిల్ల‌ల్లో ర‌క్త‌హీన‌త‌, పౌష్టికాహార లోపం వంటి వి ఏర్ప‌డ‌వ‌చ్చు.ఇందుకు క్ర‌మంత ప్ప‌కుండా నులిపురుగుల నివార‌ణ మందులు వాడాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సూచించింది. దీనివ‌ల్ల‌పిల్ల‌ల్లో,కౌమార‌ద‌శ‌లోని వారిలో ఎస్‌టిహెచ్ ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల‌లో ప‌రిస్థితులు మెరుగుప‌డ‌డానికి ఇది ఉప‌క‌రిస్తుంది.త‌ద్వారా మెరుగైన ఆరోగ్యం, పోష‌కాలు  పిల్ల‌ల‌కు అంద‌డానికి వీలు క‌లుగుతుంది.

2015లో , జాతీయ నులిపురుగుల నిర్మూల‌నా దినోత్స‌వం (ఎన్‌డిడి) నిర్వ‌హిస్తున్నారు. దీనిని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ అమ‌లు చేస్తోంది. సంవ‌త్స‌రంలో రెండుసార్లు పాఠ‌శాల‌లు,అంగ‌న్‌వాడీల‌లో ఒక రోజుకార్య‌క్ర‌మంగా నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన ఆల్బెండ‌జోల్ టాబ్లెట్‌ను నులిపురుగుల నివార‌ణ‌కు పిల్ల‌లు,కౌమార‌ద‌శ‌లోని వారికి సామూహిక మందుల పంపిణీ కార్య‌క్ర‌మం కింద అంద‌జేయ‌డం జ‌రుగుతుంది. అంత‌ర్జాతీయంగా ఈకార్య‌క్ర‌మం చేప‌ట్ట‌డం జ‌రుగుతోంది. ఈ ఏడాది మోద‌ట్లో దేశంలో చివ‌రి రౌండ్ నులిపురుగుల నివార‌ణ కార్య‌క్ర‌మంలో (కోవిడ్ మ‌హ‌మ్మారి కార‌ణంగా నిలిపివేయ‌డం జ‌రిగింది) 11 కోట్ల‌మంది పిల్ల‌లు, కౌమార‌ద‌శ‌లోనివారికి ఆల్బెండ‌జోల్ టాబ్లెట్‌ను 25 రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలలో పంపిణీ చేయ‌డం జ‌రిగింది.
ప్ర‌పంచ ఆరొగ్య సంస్థ2012లో  ఎస్‌.టి.హెచ్ పై ప్ర‌చురించిన‌ నివేదిక ప్ర‌కారం, ఇండియాలో 64 శాతం మంఇ  పిల్ల‌లు 1 నుంచి14 సంవ‌త్స‌రాల‌లోపు వారు ఎస్‌టిహెచ్ రిస్క్‌లో ఉన్నార‌ని పేర్కొంది. ప‌రిశుభ్ర‌త‌.పారిశుధ్య ప‌రిస్థితుల ఆధారంగా ఈ అంచ‌నా వేశారు.ఆ స‌మ‌యంలో ఎస్‌టిహెచ్ కుసంబంధించి ప‌రిమిత గ‌ణాంకాలు అందుబాటులో ఉన్నాయి. ఇండియాలో ఎస్‌టిహెచ్ వాస్త‌వ భారం గురించి అంచ‌నా వేసేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ , నేష‌న‌ల్ సెంట‌ర్‌ఫ‌ర‌ల్‌డిసీజ్‌కంట్రోల్ (ఎన్‌సిడిసి)ని నోడ‌ల్ ఏజెన్సీగా ఏర్పాటుచేసి , దేశ‌వ్యాప్తంగా ఎస్‌టిహెచ్ బేస్‌లైన్ మ్యాపింగ్ నిర్వ‌హించాల్సిందిగా,ఈ కార్య‌క్ర‌మాల‌ను స‌మ‌న్వ‌యం చేయాల్సిందిగా కోరింది.
ప్ర‌భుత్వ ఏజెన్సీల స‌హ‌క‌రాంతో ఎన్‌సిడిసి ఎస్‌టిహెచ్ బేస్‌లైన్ మ్యాపింగ్‌ను 2016 చివ‌రినాటికి దేశ‌వ్యాప్తంగా చేప‌ట్టింది. ఈ గ‌ణాంకాల ప్ర‌కారం, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లొ ఈ స‌మ‌స్య  12.5 శాతం ఉండ‌గా, త‌మిళ‌నాడులో 85 శాతం వ‌ర‌కు ఉన్న‌ట్టు తేలింది.

క్ర‌మం త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తున్న ఎన్‌.డి.డి కార్య‌క్ర‌మం ప్ర‌భావాన్ని అంచ‌నా వేసేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ ఇటీవ‌ల ఫాలోఅప్ స‌ర్వేని ఎన్‌సిడిడి, దాని భాగ‌స్వామ్య సంస్థ‌ల‌చేత చేప‌ట్టింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ నియ‌మించిన శాస్త్రీయ క‌మిటీ దీనికి మార్గ‌ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది.  ఇవాళ్టి వ‌రు ఈ ఫాలో అప్ స‌ర్వేలు 14 రాష్ట్రాల‌లో పూర్తి అయ్యాయి. ఈ 14 రాష్ట్రాల గ‌ణాంకాల‌ను గ‌మ‌నించిన‌పుడు బేస్ లైన్ స‌ర్వేతో పోల్చిన‌పుడు, ఈ ఫాలో అప్‌స‌ర్వేలో పిల్ల‌ల్లో నులిపురుగుల స‌మ‌స్య త‌గ్గిన‌ట్టు గుర్తించారు. ఛ‌త్తీస్‌ఘ‌డ్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, మేఘాల‌య‌,సిక్కిం, తెలంగాణ‌, త్రిపుర‌, రాజ‌స్థౄన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, బీహార్ రాష్ట్రాలలో పిల్ల‌ల్లో నులిపురుగుల స‌మ‌స్య చెప్పుకోద‌గిన స్థాయిలో త‌గ్గిన‌ట్టుతేలింది.
ఉదాహ‌ర‌ణ‌కు, ఛ‌త్తీస్‌ఘ‌డ్ ఇప్ప‌టివ‌ర‌కు 10 రౌండ్ల ఎన్‌.డి.డిని నిర్వ‌హించింది. 2016లో ఈ స‌మ‌స్య 74.6 శాతం ఉండ‌గా 2018లో ఇది 13.9 కి ప‌డిపోయింది. అలాగే సిక్కింలో 9 రౌండ్ల ఎన్‌డిడి నిర్వ‌హించారు. 2015లో 80.4 శాతం ఉండ‌గా 2019కి అది 50.9 శాతానికి చేరింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో  ప‌రిమితంగా నే త‌గ్గింది. ఎపిలో 9రౌండ్లు నిర్వ‌హించ‌గా, 2016లో 36 శాతం ఉన్న స‌మ‌స్య‌, 2019లో 34.3 శాతానికి మాత్ర‌మే చేరింది.
రాజ‌స్థాన్‌లో 2013లో బేస్ లైన్‌స‌ర్వే 21.1 శాతం ఉన్న‌ట్టుతేల్చ‌డంతో ఎన్‌డిడిని సంవ‌త్స‌రానికి ఒక‌సారి మాత్ర‌మే నిర్వ‌హించారు. 2019 నాటికి ఇది 1 శాతం కంటే త‌క్కువ‌కు చేరిన‌ట్టు గుర్తించారు.
హెచ్ ఎల్ ఎస్ సి ఆధ్వ‌ర్వంలో ,ఎన్‌సిడిసిలో ని నిపుణుల స‌హాయంతో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల‌కుఅనుగుణంగా ఎస్‌టిహెచ్ నియంత్ర‌ణ‌, చికిత్స త‌దిత‌ర అంశాల‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తున్నారు.ఈ విష‌యంలో ఇప్ప‌టివ‌రకూ సాధించిన ప్ర‌గ‌తిని కాపాడుకునేందుకు గ‌ట్టి చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.
ఎన్‌డిడి కార్య‌క్ర‌మాన్ని, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ నేతృత్వంలో, మ‌హిళ‌,శిశు సంక్షేమ మంత్రిత్వ‌శాఖ, విద్యామంత్రిత్వ‌శాఖ ల స‌హ‌కారంతో , ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సాంకేతిక స‌హ‌కారంతో  ఇత‌ర సాంకేతిక భాగ‌స్వాముల‌తో క‌ల‌సి అమ‌లు చేస్తున్నారు. కోవిడ్ -19 మ‌హ‌మ్మారి నియంత్ర‌ణ‌కు కృషి చేస్తూనే కేంద్ర ఆరోగ్య‌మంత్రిత్వ‌శాఖ అత్యావ‌స్య‌క ఆరోగ్య‌సేవ‌ల‌ను  కొన‌సాగించేందుకు క‌ట్టుబ‌డి ఉంది.పాఠ‌శాల‌లు,అంగ‌న్‌వాడీలు మూసివేయ‌డంతో, క్షేత్ర‌స్థాయి ఆరోగ్య‌కార్య‌క‌ర్త‌లకు కోవిడ్ -19 సమ‌యంలో పిల్ల‌ల‌కు , కౌమార ద‌శ‌లోని వారికి ( 1 సం నుంచి 19 సంవ‌త్స‌రాల లోపు వారికి) వారి ఇళ్ల‌వ‌ద్ద‌కు వెళ్లి ఆల్బెండ‌జోల్ మాత్ర‌ల పంపిణీ విష‌యంలో తీసుకోవ‌ల‌సిన మార్గ‌ద‌ర్శ‌కాల‌పై వారికి శిక్ష‌ణ ఇవ్వ‌డం జ‌రిగింది. అలాగే గ్రామ ఆరోగ్య‌, పారిశుధ్య‌, పౌష్టికాహార దినోత్స‌వాల సంద‌ర్భంగా వీటిని ఆయా గ్రామాల‌లో పంపిణీ చేసేందుకు ఆగస్టు- అక్టోబ‌ర్ 2020 మ‌ధ్య చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింది. కోవిడ్ మ‌హ‌మ్మారి కార‌ణంగా , ఈ కార్య‌క్ర‌మాన్ని కొన‌సాగించ‌డంలో భాగంగా ఈ మార్పులు తీసుకువ‌చ్చి, నులిపురుగుల నివార‌ణ కృషిని కొన‌సాగించ‌డం జ‌రుగుతోంది.

 

*****