Print
XClose
Press Information Bureau
Government of India
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
30 JAN 2020 12:47PM by PIB Hyderabad
చైనా నుండి తిరిగి వచ్చే ప్రయాణికులకు సలహా...

మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షించడానికి మీరు తెలుసుకోవలసిన విషయాలు:

చైనా లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది, అంతర్జాతీయంగా ఇతర దేశాలలో కేసులు నమోదయ్యాయి.


కరోనా వైరస్ సాధారణ జలుబు నుండి మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (MERS)-CoV మరియు తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (SARS-CoV) వంటి తీవ్రమైన లక్షణాలు కలుగజేస్తుంది.

  

కరోన వైరస్ లక్షణాలు?

జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సాధారణ లక్షణాలు ఉంటాయి.


మిమ్మల్ని మరియు ఇతరులను అనారోగ్యానికి గురికాకుండా ఎలా కాపాడుకోవాలి?

మీరు ఇటీవల చైనాకు ప్రయాణించినట్లయితే (గత 14 రోజుల లోపులేదా nCoVinfected వ్యక్తితో సన్నిహితంగా  ఉంటే, మీరు తీసుకోవాల్సిన జాగ్రతలు:

 

మీరు తిరిగి వచ్చిన తర్వాత 14 రోజులపాటు, ఇంట్లో  అందరితో పాటు కాకుండా ఒంటరిగా ఉండండి.

 

• మీరు ప్రత్యేక గది లో మాత్రమే నిద్రించండి.

• ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇతరులతో దూరంగా ఉండండి.


• దగ్గు, తుమ్ములు ఉన్నప్పుడు ముక్కు మరియు నోటికి రుమాలును అడ్డం పెట్టుకోండి.

• జలుబు లేదా ఫ్లూ వంటి లక్షణాలు ఉన్న వారితో సన్నిహితంగా ఉండకండి.  (అలాంటి వ్యక్తి తో కనీసం ఒక మీటరు దూరంగా ఉండండి).


ఇంట్లో ప్రతి ఒక్కరూ అన్ని సమయాల్లో చేతి పరిశుభ్రతను పాటించాలి.  చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

 

•  ముఖ్యంగా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు.

•  అనారోగ్యంతో, ఇతర వ్యాదులతో బాధపడుతున్న వారి తో  ఉన్నప్పుడు.

•  ముఖ్యంగా ఆహారాన్ని వంట చేసే ముందు, వంట చేసిన తర్వాత, వంట చేసేటప్పుడు.

•  ఆహారం తీసుకునే ముందు

•  మలవిసర్జన తరువాత

•  చేతులు మురికిగా ఉన్నప్పుడు

•  జంతువులు లేదా జంతువుల వ్యర్థాలను తాకిన తర్వాత


ఒకవేళ మీరు జ్వరందగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటేచైనా నుండి తిరిగి వచ్చిన 28 రోజులలోపు:

మరింత సమాచారం కోసం భారత ప్రభుత్వ  ఆరోగ్య మంత్రిత్వ శాఖ, కంట్రోల్ రూమ్ నెంబర్ 91-11-2397 8046 ను సంప్రదించండి.

 

తక్షణమే సమీప వైద్య కేంద్రాన్ని సంప్రదించండి.

***